ఎం.నర్సింహ స్వామికి డాక్టరేట్ ప్రదానం..

నవతెలంగాణ -డిచ్ పల్లి
కీ.శే. ప్రొఫేసర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి పర్యవేక్షణలో ఎం. నర్సింహ స్వామి చేసిన పిహెచ్. డి. పరిశోధనాంశం “డాక్టర్. వెలిచాల కొండలరావు జీవితం – వాఙ్మయ సేవ” అనే సిద్ధాంత గ్రంథానికి తెలుగు అధ్యయన శాఖలో ఎ. నర్సింహ స్వామికి పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు.దీనికి సంబంధించిన ఓపెన్ వైవా – వోస్ (మౌఖిక పరీక్ష)  గురువారం ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలోని మిని సెమినార్ హాల్ లో నిర్వహించారు.ఎక్స టర్నల్ ఎగ్జామినర్ గా డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని తెలుగు శాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఎన్. రజని పాల్గొని సిద్ధాంత గ్రంథంపై పలు ప్రశ్నలు అడిగి పరిశోధకుడి నుంచి సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ పి. కనకయ్య చైర్మన్ గా, పాఠ్యప్రణాళిక  సంఘ చైర్ పర్సన్ ప్రోఫేసర్ వంగరి త్రివేణి కన్వీనర్ గా వ్యవహరించారు. విభాగాధిపతి ప్రొఫెసర్ కె. లావణ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.