నవతెలంగాణ – అయిజ
తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ స్థాపించిన జై నడిగడ్డ యువత అద్యక్షతన మండలంలోని పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో మొదటి రెండు ర్యాంకులతో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం చేయడం జరిగింది జై నడిగడ్డ యువత జిల్లా సమన్వయకర్త కుర్వ వీరేష్ ఆధ్యర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా నోడల్ అధికారి హ్నదయ రాజు. మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలోని విద్యార్థుల యొక్క ప్రతిభను ప్రోత్సహించడం చాలా గొప్ప విషయం అని అన్నారు ఈ ప్రాంతంలో విద్యార్థులు అన్ని రంగాలలో ముందు వరుసలో వుంటారని అందుకు నిదర్శనమే ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ కళాశాల విద్యార్థులు జిల్లాలోని ప్రతిమ స్థానంలో ర్యాంకులు సాధించారని అన్నారు అదేవిధంగా డాక్టర్ ఆంజనేయ గౌడ్ అనే వ్యక్తి నడిగడ్డ ప్రాంతానికి గొప్ప ఆదర్శమని రాష్ట్రస్థాయి పదవిలో ఉన్న కానీ ఈ ప్రాంత ప్రజల విద్యార్థుల యొక్క ప్రగతికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తారని అన్నారు ఈ సందర్భంగా జై నడిగడ్డ యువత సంస్థను ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా ఎమ్మార్వో లక్ష్మి మాట్లాడుతూ విద్యారంగంలో ఉన్న పల్లె మరియు పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వ కళాశాల మరియు కళాశాల విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా అనేక విద్యార్థులకు ఇది ఆదర్శవంతమైన కార్యక్రమమని ఇంత గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టిన జై నడిగడ్డ యువత సంస్థ సభ్యులను అభినందించారు ఈ సంస్థ జిల్లాలోని అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు సేవ చేయడంలో ముందు వరుసలో ఉండటం అభినందనీయం అని ఆమె పేర్కొన్నారు జై నడిగడ్డ యువత జిల్లా సమన్వయకర్త కుర్వ వీరేష్ ఆధ్యర్యంలో జరిగింది జై నడిగడ్డ యువత జిల్లా చీఫ్ కో ఆర్డినేటర్ బొమ్మల రామకృష్ణ మాట్లాడుతూ జై నడిగడ్డ యువత ఉద్ధ్యేశంలో ప్రదాన లక్ష్యమైన విద్యాభివృద్ధిలో బాగంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు సన్మానం చేయడం జరుగుతుందని ఇట్టి ప్రోత్సాహాలు అందుకున్న విద్యార్థులు వారి యొక్క సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకొని జీవితంలో విశిష్టమైన వ్యక్తులుగా ఎదగాలని.. విద్యార్థులు వారికి ఏ రంగంలో అభిరుచి,ఆసక్తి ఉంటుందో ఎవరిది వారికే ముందుగా తెలుస్తుందని.. ఎంచుకున్న రంగంలో విశిష్టమైన వ్యక్తిగా ఎదగాలంటే వినయం విధేయతతో పాటు మీపై మీకు నమ్మకం ఉండాలని, వీటితో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ తోడైతే జీవితంలో అసాధ్యమను దేన్నైనా సుసాధ్యం చేయవచ్చని.. పాఠశాలల ఉపాధ్యాయలు కూడా విద్యార్థుల యొక్క అభిరుచులు గుర్తించి వారికి ఇష్టమైన రంగంవైపు మార్గనిర్దేశం చేయాలని సూచించడం జరుగింది. జై నడిగడ్డ యువత సంఘం వ్యవస్థాపకులు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు పేద విద్యార్థులకు అండగా ఉంటారని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థులలో ఆత్మస్థైర్యం నింపుకొనేందుకు టెన్షన్ ఫ్రీ టెక్నిక్స్ బుక్స్ జిల్లా కోశాధికారి మోహన్ గౌడ్ మరియు అయిజ మండల చీఫ్ కోఆర్డినేటర్ అశోక్ గౌడ్ అదేవిధంగా చట్టం న్యాయం అనే తన్నీరు శ్రీనివాస్ రావు పబ్లిషర్స్ బుక్స్ ను సింధనూర్ మహేష్ డొనేట్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీవో సాయి ప్రకాష్ zphs బాలురు పాఠశాల శశిపాణ శర్మ జై నడిగడ్డ యువత సలహాదారులు బొప్పల శ్రీనివాస్ జిల్లా కంచుపాడు శేషన్న గౌడ్ జిల్లా సమన్వయకర్తలు పవన్ కుమార్, బోయ సత్యం, బీచుపల్లి రామాంజనేయులు, నరసింహ గౌడ్, రంగస్వామి గౌడ్, వీరేష్ గౌడ్, మీడియా ఇన్ఛార్జి సురేష్ గౌడ్, అయిజ మండల చీఫ్ కోఆర్డినేటర్ అశోక్ గౌడ్, మండలాల సమయకర్తలు అంజి, వీరన్న, ప్రదీప్ కుమార్, సుధీర్, మోహన్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, గోనారం హనుమంతు, రాముడు, రాజశేఖర్, మరియు పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రతిభకు కనబర్చిన విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు…