జాగిల్‌ ఫౌండర్‌ రాజ్‌ ఎన్‌కు అవార్డు

Award to Jagill founder Raj Nహైదరాబాద్‌: జాగిల్‌ ప్రీపెయిడ్‌ ఓషన్‌ సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు రాజ్‌ ఎన్‌కు ఫిన్‌టెక్‌ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కింది. బిడబ్ల్యు ఫెస్టివల్‌ ఆఫ్‌ ఫిన్‌టెక్‌ కాన్‌క్లేవ్‌ అండ్‌ అవార్డ్స్‌ 2024లో ఈ ప్రతిష్టాత్మకమైన గుర్తింపు దక్కిందని ఆ సంస్థ తెలిపింది. నిరంతర ఆవిష్కరణ, అభివృద్థి అనేవి మిగిలిన వారికంటే ముందు ఉండటంలో అత్యంత కీలక పాత్ర పోషించటంతో పాటుగా స్థిరమైన వృద్ధిని సాధించడానికి కీలకమైనవి అని రాజ్‌ ఎన్‌ పేర్కొన్నారు.