
తెలంగాణ యూనివర్సిటీ, వృక్షశాస్త్ర విభాగంలో సుంకరి శ్వేత కి మంగళవారం జరిగిన వైవా-వోక్ కార్యక్రమంలో డాక్టరేట్ ప్రదానం చేశారు. ప్రొఫెసర్ ఎం అరుణ పర్యవేక్షణలో శ్వేత “ఇకలాజికల్ స్టడీస్ ఆఫ్ టు లేక్స్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ విత్ రిఫరెన్స్ టు డైవర్సిటీ ఆఫ్ ప్లాంక్టానిక్ అండ్ మ్యాట్ ఫార్మింగ్ ఆల్గల్ కమ్యూనిటీస్” అనే అంశం పై పరిశోధక గ్రంథాన్ని తెలంగాణ వర్సిటీ కి సమర్పించారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్ కి చెందిన ప్రొఫెసర్ మక్బూల్ అహ్మద్ ఎక్స్టెర్నల్ ఎగ్జామినర్ గా వ్యవహరించారు. వైవా కార్యక్రమంలో శ్వేత తన పరిశోధనలో నిజామాబాద్ జిల్లాలోని న్యాల్కల్, మంచిప్ప మంచినీటి చెరువులలో పెరుగుతున్న శైవలాల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పరిశోధక విద్యార్థి శ్వేత పరిశోధన ఫలితాలపై సంతృప్తి చెంది తెలంగాణ యూనివర్సిటీ అధికారులు ఆమెకు డాక్టరేట్ అవార్డును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వృక్షశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ ఎమ్. అరుణ, బివోఎస్ ప్రొఫెసర్ విద్యావర్ధిని, డాక్టర్. ఎ. ఎ. హలీమ్ ఖాన్, డాక్టర్. దేవరాజు శ్రీనివాస్, డాక్టర్. వి. జలంధర్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.