సలీమాకు పీహెచ్‌డీ ప్రదానం

Awarded PhD to Salimaనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో భారత స్వాతంత్రోద్యమంలో మహిళల పాత్ర అనే అంశంపై పరిశోధన చేసి గ్రంథం సమర్పించినందుకుగాను షేక్‌ సలీమాకు పీహెచ్‌డీ ప్రధానం చేసినట్లు రీసెర్చ్‌ సెల్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.కిరణ్మయి తెలిపారు. రీసెర్చ్‌ డైరెక్టర్‌గా ఎం.రవిశేఖర్‌ వ్యవహరించారు. సలీమా పీజీ చేసే సమయంలో విద్యార్థి ఉద్యమంలో పని చేస్తూ అధ్యయనం. పోరాటం నినాదాన్ని పుణికి పుచ్చుకుని పోరాటాలతో పాటు అధ్యయనంలోనూ ముందు పిఠీన ఉండేవారు. వర్సిటీ లో పీజీ స్థాయిలో నాలుగు గోల్డ్‌ మెడల్స్‌ ను సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సలీమాకు డాక్టరేట్‌ రావడం పట్ల పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ చల్లపల్లి స్వరూప రాణి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.