వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన ఆదర్శ పాఠశాల విద్యార్థిని కి సన్మానం

నవతెలంగాణ – రెంజల్
తెలంగాణ ఆదర్శ పాఠశాల ల ఉమ్మడి జిల్లాల ఎస్ జి ఎఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో రెంజల్ ఆదర్శ పాఠశాల విద్యార్థిని మాలతి ని పాఠశాల ప్రిన్సిపాల్ బలరాం సన్మానం జరిపారు. అండర్ 17 ఇయర్స్ విభాగంలో 76 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో ప్రథమ స్థానంలో రావడంతో ఆమె రాష్ట్ర స్థాయికి ఎందుకని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో సైతం అత్యుత్తమ ప్రతిభను కనబరిచాలని ఆయన అభినందించారు. ఆయనతోపాటు వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు..