పదో తరగతి టాపర్స్‌కు సన్మానం

నవతెలంగాణ – ఊరుకొండ
క్లాస్‌ మేట్‌ క్లబ్‌ కల్వకుర్తి వారి ఆధ్వర్యంలో ఉరుకుంద మండల కేంద్రంలోని మండల పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈ సంవత్సరం పదవ తర గతిలో టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు మంగ ళవారం రూ.1,116/- నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం, మెడల్‌, శాలువాతో సన్మానించారు. వారిలో డివిజన్‌ టాపర్‌ గా వచ్చిన సభా యాస్మిన్‌ 9.5 జీపీఏ మాదారం ఉన్నత పాఠశాల, ఉరు కొండపెట్‌ నుంచి నేహా తబసుము 9.3 జీపీిఏ, ఊరు కొండ నుంచి మనీషా 8.8 జీపీిఏ సాధించిన విద్యార్థులున్నారు. వీరికి నగదు బహుమతినీ దాత రఘుపతిపేట్‌ కు చెందిన క్లాస్‌ మేట్‌ క్లబ్‌ సభ్యులు ఆకుతోట రవికుమార్‌ అందజేశారు. జిల్లాప్రధాన కార్యదర్శి లక్ష్మీ నరసిం హారావు,ప్రధానోపా ధ్యా యులు బాల య్య, మురళీ మోహన్‌ గౌడ్‌, ఉపా ధ్యాయులు శ్రీనివాసరెడ్డి, రంగ రాజన్‌, పర్వ తాలు,, సరళ,స్వస్థిత చంద్ర శేఖర్‌, వెంకటయ్య పాల్గొన్నారు.