జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యునికి సన్మానం..

Honor to the member of National ST Commission..నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని ఎక లవ్య మోడల్ పాఠశాలను బుధవారం జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యులు ఇజటీత్ హుస్సెన్ నాయక్ సందర్శించినప్పుడు తెలంగాణ యూనివర్సిటీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ యూనివర్సిటీ యునియన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి తమ సమస్కలు వినవించు కున్నారు. తమ సమస్యల పరిష్కరం కోసం త్వరలో యూనివర్సిటీ నుంచి సందర్శిస్తానని వారికి హమీ ఇచ్చారు.అంతకు ముందు జాకత్ హస్సెన్ నాయక్ ను వారు ఘనంగా సన్మానించారు.ఈ  కార్య క్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ఎస్సీ/ఎస్టి అద్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.