
గణిత, సైన్సు ఒలంపియాడ్ టెస్టులో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన అచ్చంపేట న్యూ ఎక్సీడ్ స్కూల్ విద్యార్థులను మంగళవారం యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా సమావేశంలో స్కూల్ ప్రిన్సిపాల్ కపిలవాయి శ్వేత మాట్లాడారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి ఒలంపియాడ్ పోటీ పరీక్షలో 15వేల మంది విద్యార్థులు పాల్గొనగా తమ పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చారన్నారు. పేరుగాంచిన శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒలంపియాడ్ టెస్టు నిర్వహిచగా సైన్సు విభాగంలో స్కూల్‌కు చెందిన ఆరో తరగతి విద్యార్థి హర్షవర్థన్ రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంకు సాధించి అత్యంత ప్రతిభ కనబర్చాడు. అలాగే హేతాజ్ఞ, జశ్వంత్, గణితంలో జిల్లా రెండో ర్యాంకు, కార్తీకేయ సైన్సులో జిల్లా రెండో ర్యాంకు, సహస్ర గణితంలో జిల్లా మూడో ర్యాంకు సాధించారు. రిషిక, అమూల్య జిల్లా కన్సోలేషన్ బహుమతులు అందుకున్నారని తెలిపారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, బోధించిన ఉపాధ్యాయబృందాన్ని స్కూల్ కరస్పాండెంట్ కపిలవాయి చంద్రమోహన్ ప్రత్యేకంగా అభినందించారు.