పదోన్నతి పొందిన ఎస్సై కు సన్మానం

నవతెలంగాణ – నవీపేట్: సీఐగా పదోన్నతి పొందిన ఎస్సై రాజారెడ్డిని ఎమ్మార్పీఎస్ మరియు ఎంఎస్ పి నాయకులు పూలబోకే, శాలువాతో శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో ఎస్సైగా బాధ్యతలు నిర్వహించి పదోన్నతి పొందడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి నాయకులు మానికోల్ల గంగాధర్, ఆకారం రమేష్ ఎంఆర్పిఎస్ నాయకులు జీవన్, మోహన్, సంజీవ్, ఎల్లయ్య, సుమన్ తదితరులు పాల్గొన్నారు.