10 జీపీఏ సాధించిన విద్యార్థులకు విద్యార్థులకు సన్మానం

– భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని పడకల్ ఉన్నత పాఠశాల  చెందిన విద్యార్థులు ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో హర్షిక మరియు శంకర్ 10 జిపిఏ సాధించడం అలాగే ఇతర విద్యార్థులు ఉత్తమ ప్రతిభ  చూపడం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేందర్ రెడ్డి అన్నారు . గ్రామ అభివృద్ధి కమిటీ మరియు 1996-96 గోల్డెన్ బ్యాచ్ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి గ్రామ కమిటీ మరీ గ్రామ యువత సహకరించాలన్నారు . ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గ్రామ కమిటీ మరియు 1996-97 ఎస్ఎస్సి గోల్డ్ బ్యాచ్ తరపున ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్ఎస్సి గోల్డ్ బ్యాచ్  ప్రతినిధులు పురుషోత్తం అంకం నరేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు గ్రామ కమిటీ సభ్యులు ప్రసాద్, హనుమాన్లు ప్రదీప్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు