జిల్లాపరిషత్ పాఠశాలలో తెలుగు బాషా పండితులకు సన్మానం.

నవతెలంగాణ – జుక్కల్

జుక్కల్  మండల కేంద్రం లోని ప్రభూత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాద్యాయబృందం ఆధ్వర్యంలో గురువారం నాడు  తెలుగు బాషా పండితులు సన్మానంతో పాటు వ్యాసరచన, క్విజ్ పోటీలను విద్యార్థులకు నిర్వహించామని  ప్రాదాన ఉపాద్యాయుడు బస్వంత్ పటేల్ తెలిపారు. ఈ సంధర్భంగా హెచ్ఎం బస్వంత్ పటేల్  మాట్లాడుతు తెలుగు బాషా పాండిత్యంలో పి హెచ్ డి  డాక్టరేట్ పట్టా పొందిన బాస్కర రావ్ కు ఉపాద్యాయ బృందం సన్మానించడం జర్గిందని తెలిపారు. పాఠశాలలోని విద్యార్థిని కూమారి వర్ష, శ్రద్గ,  వంద పద్యాలు , త్రీష,  కావేరి,  నందిని, సురేఖ,  కీర్తన,  భవానీ, అవంతిక, సంగీత    యాబై పద్యాలు , పాడటం జర్గింది వీరికి మెుదటి వంద చదివిన వారికి రూ” ఐదు వందలు, యాబై చదివిన ఒక్కోక్కరికి రూ” రెండువందల యాబై రపాయలు నగదును బహుమతులను ఉపాద్యాయులు అందరు  కలిసి అందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం, తెలుగు బాషా పండితుడు బాస్కర్ రావ్, పాఠశాల ఉపాద్యాయబృందం తదితరులు పాల్గోన్నారు.