నవతెలంగాణ -పెద్దవంగర: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని భోదనలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను మండలానికి చెందిన కొరిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్, పెద్దవంగర జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శివరాత్రి అంజయ్య, ఝాన్సీ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. మంగళవారం వీరిని మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే శంకర్ నాయక్, డీఈవో రామారావు ల చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఉపాధ్యాయులను మెమెంటో, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈ అవార్డుతో తమ బాధ్యత మరింత పెరిగిందని, రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు