నవతెలంగాణ – జన్నారం
మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన సిరినేని రాహుల్ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో ఎంబీబీఎస్ లో సీట్ సాదించారు. ఈ సందర్బంగా మండల పద్మశాలి సంఘం ఆద్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో రాహుల్ ను ఘనంగా సన్మానం చేశారు. సందర్భంగా పద్మశాలి సంఘం మండల అధ్యయక్షుడు చెట్టుపల్లి గంగయ్య మాట్లాడుతూ రాహుల్ ఎంబిబిఎస్ పూర్తి చేసి డాక్టర్ వృత్తిని చేపట్టి పేద ప్రజలకు సేవలు అందించాలన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో రాహుల్ తల్లిదండ్రులు శివసాగర్, కళావతి, పద్మశాలి సంఘం మండల నాయకులు చెటుపల్లి సత్యం, అయ్యొరి వీరయ్య, దశరథం, దోమల బాస్కర్, చెటుపల్లి క్రిష్ణ, వాసాల శ్రీనివాస్, వాసాల మహేష్, సిరిపురం రామన్న, మాటేటి కొమురయ్య, చెటుపల్లి లచ్చన్న, అయ్యొరి సత్యన్న, పోతు శ్రీను. సంబారి శంకరయ్య, గౌడ అంజన్న తదితరులు పాల్గొన్నారు.