ఉత్తమ గ్రేడ్ సాధించిన విద్యార్థికి సన్మానం..

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 10జిపిఏ సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండలం నుండి 10జిపిఏ సాధించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమ్మర్ పల్లి విద్యార్థి ఎండీ ఫైజాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న లను సత్కరించారు. ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, ఆర్టీసీ ఎండీ  సజ్జనార్, వందేమాతరం ఫౌండేషన్ సభ్యుల చేతుల మీదుగా ప్రశంసా పత్రం, బంగారు పతకాన్ని అందుకున్నట్లు  ప్రధానోపాధ్యాయులు సాయన్న తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాల పునః ప్రారంభం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పాఠ్య పుస్తకాల, ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీపీ  గౌతమి, ఎంపీడీఓ చింత రాజ శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ వాసవి, గ్రామ అభివృద్ధి కమిటీ  పెద్దలు ప్రధానోపాధ్యాయులు సాయన్న, విద్యార్థి ఫైజాన్ ను అభినందించి శాలువా కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు అజ్మత్ హుస్సేన్, పంచాయతీ కార్యదర్శి  శాంతికుమార్, ఉపాధ్యాయులు, సిఅర్పిలు, తదితరులు పాల్గొన్నారు.