కరాటేలో విజేతలకు సన్మానం…

నవతెలంగాణ – నవీపేట్: మండల కేంద్రంలోని వసుధ పాఠశాల విద్యార్థులు జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో బంగారు పతకం సాధించిన పసుల గౌతం మరియు సిల్వర్ మెడల్ సాధించిన కొర్వ శ్రీవాత్సలకు పాఠశాల ప్రిన్సిపల్ న్యాలకంటి శంకర్ మంగళవారం ప్రశంసా పత్రం మెడల్ తో పాటు శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శంకర్ మాట్లాడుతూ కరాటే ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఆడపిల్లలకు రక్షణ కరువైనందున ఆడపిల్లలు కచ్చితంగా కరాటే శిక్షణ తీసుకోవాలని సూచించారు. గోల్డ్ మెడల్ సాధించిన ఆరవ తరగతి విద్యార్థి గౌతమ్ జాతీయస్థాయిలో సైతం పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా  తమ పాఠశాల కరాటే టీచర్ బిందును ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ గంగా ప్రసాద్, ఉపాధ్యాయులు సుజాత, నీల తదితరులు ఉన్నారు.