
శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని మండలంలోని కొయ్యుర్ గ్రామంలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు నిర్వహించి ఉట్టికొట్టే కార్యక్రమాన్నీ నిర్వహించారు.ఉట్టి కొట్టే కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల యాదవ యువత హాజరై పోటిల్లో పాల్గొన్నారు. ఈ పోటిల్లో గెలుపొందిన ఇప్పలపల్లి గ్రామానికి చెందిన గండ్రకోట స్వామి యాదవ్ రూ.2016 నగదుతోపాటు ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముందుగా డప్పు చప్పుళ్ళు,నృత్యాలు,వాయిద్యాలతో శ్రీకృష్ణుడు విగ్రహాన్ని ఊరేగిపుగా రావడం పలువురుని ఆకర్షించాయి.ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు ఆత్మకూరి స్వామి యాదవ్,యాధండ్ల రామన్న యాదవ్,బోయిని రాజయ్య యాదవ్,కోడారి చిన మల్లయ్య యాదవ్, సిద్ధి లింగమూర్తి యాదవ్,పంచిక మల్లేష్ యాదవ్,రవి యాదవ్, కోడారి బాపు యాదవ్, కట్టెకొల్ల పర్వతాలు యాదవ్, కావేటి మల్లేష్ యాదవ్,యాధండ్ల గట్టయ్య యాదవ్, బాసనవేన సంపత్ యాదవ్, దేవరాజు యాదవ్,శ్రీషేలం యాదవ్,గానవేన రాజిరు యాదవ్ పాల్గొన్నారు.