నవతెలంగాణ మల్హర్ రావు: మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో ఉన్న తెలంగాణ ఆదర్శ పాఠశాలలో మండల స్థాయి ఇంటర్మీడియట్ క్రీడా పోటీలు నిర్వహించినట్లుగా పాఠశాల ప్రిన్స్ పాల్ దూడ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని తాడిచెర్ల,మల్లారం, మోడల్ స్కూల్, దుబ్బపేటలోని కేజీ బివి పాఠశాలల విద్యార్థులకు కోకో, కబడ్డీ తదితర పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు జెడ్పిటిసి కోమల బహుమతులు ప్రదానం చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జనగామ స్వరూప, జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.