
భూపాలపల్లి జిల్లా స్థాయి ఉత్తమ గ్రామపంచాయతీలకు సమాచార హక్కుచట్టం రక్షణ వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అందజేసినట్లుగా ఆర్టీఐ కమిటీ తెలిపింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సంపూర్ణంగా చేపట్టిన మహాముత్తారం మండలంలోని ములుగుపల్లి, మినాజీపేట గ్రామపంచాయతీలు ఎంపికయినట్లుగా, ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు చర్లపల్లి వెంకయేశ్వర్లు గౌడ్ ఆదేశాల మేరకు ఉత్తమ పురస్కారాలకు ఆయా గ్రామాల సర్పంచ్ లు దూలం మల్లయ్య గౌడ్, ముత్యాల రాజు యాదవ్ లకు సోమవారం ఆర్టీఐ కాటారం కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ మల్హర్ మండల కార్యదర్శి బండి సుధాకర్ లు పురస్కారాలు అందజేసి సర్పంచ్, కార్యదర్శిలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ములుగు పల్లి కార్యదర్శి పాగే లక్ష్మీ, ప్రజలు పాల్గొన్నారు.