ఉత్తమ మహిళ జిపి ఉద్యోగులకు అవార్డులు ప్రదానం

నవతెలంగాణ – మల్హర్ రావు
సాయిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు పురస్కరించుకుని అల్ ఇండియా అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ 542. జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి, రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల శంకర్,పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కె.వెంకటస్వామి,ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మన్ చేతులమీదుగా  కాళేశ్వరం జోన్ మల్హర్ మండలంలో ఉత్తమ మహిళ పంచాయతీ కార్యదర్శుల నుంచి ఉద్యోగులుగా ఎంపికైన వేల్పుల సరిత (ఇప్పులపల్లి, జిపి) అజ్మీరా సునీత (అడ్వాలపల్లి ,జిపి), సామల వెన్నెల (ఆన్ సాన్ పల్లి ,జిపి) ముగ్గురు పంచాయతీ కార్యదర్శులతోపాటు తాడిచెర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో సపాయి కార్మికురాలు అక్కపాక ఓదెమ్మకు  గోల్డ్ మెడల్స్, ప్రసంశ పత్రాలు,అవార్డులు,శాలువాతో ఘనంగా సన్మానాలు,పూలే జీవిత చర్తిత్ర గ్రంధం అందజేసినట్లుగా ఎంపిక కమిటీ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్,జాతీయ మానవ హక్కుల మండలి మండల అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడు బండి సుధాకర్ లు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడారు మహానియురాలు సావిత్రీబాయి పూలే 194 జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రములోని అమర్ చంద్ కల్యాణ మండపం జెండా చౌరస్తాలో ప్రశంస పత్రాలు,మెమెంటోలు అందజేసీనట్లుగా తెలిపారు.