– హరిదా మహాసభలో ప్రముఖ కవి విమర్శకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి
నవతెలంగాణ కంఠేశ్వర్
సరస్వతీ రాజ్ హరిదా తెలంగాణ విశిష్ట స్థాయి సాహిత్య పురస్కారం తనకు ప్రకటించడం వల్ల ఎంతో ఆనందం కలిగిందని, దానితో పాటు బాధ్యత పెరిగిందని ప్రముఖ కవి విమర్శకుడు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి నవ్యభారతి గ్లోబల్ స్కూల్ ఆవరణలో జరిగిన హరిదా రచయితల సంఘం ఆరవ మహాసభలో ఆయన మాట్లాడారు. తెలుగు సాహిత్యంలో ఎంతో కృషి చేసిన డాక్టర్ సామల సదాశివ, నందిని సిద్ధారెడ్డి, ఆచార్య ఎన్. గోపి వంటి ప్రముఖులు ఐదుగురు ప్రతిభామూర్తులకు ఈ అవార్డు అందజేశారని, ఆరవ వ్యక్తిగా తనకు అందించడం అంటే నా కృషి పట్ల, నా బాధ్యత పట్ల నిజామాబాద్ సాహిత్య లోకానికి ఉన్న నమ్మకం అని తాను నమ్ముతున్నానన్నారు. రాష్ట్ర సాహిత్య చరిత్రలో నిజామాబాద్ వేదికగా హరిదా చేస్తున్న కృషి, సరస్వతి రాజ్ అవార్డుల ప్రదానం సాహిత్యకారులకు వెన్నుదన్నుగా ఉంటున్నాయని అభినందించారు.
కార్యక్రమంలో కీలక ప్రసంగం చేసిన తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ కవితా సృజనలో, విమర్శ రచనలో, రూబాయిల రూపకల్పనలో, అపురూప అనువాదాలతో , ఏడు కోలల బాయి అని ఎన్నికల శతకంతో తెలుగు సాహిత్య రంగంలో తెలంగాణ వీరుడిగా ఏనుగు నరసింహారెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నాడని కొనియాడారు. హరిదా వారిని గౌరవించడం సముచితం అన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ ప్రతిమా రాజ్ మాట్లాడుతూ సాహిత్య కారులు సమాజానికి చేస్తున్న సేవ గొప్పదని, మొత్తం సాహిత్యకారుల కోసం ఒక ప్రత్యేకంగా రోజును ప్రకటించి పండగలాగా జరపాలని సూచించారు. తనకు అవకాశం ఇస్తే జిల్లా సాహితీవేత్తల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తానని తెలిపారు.
సరస్వతి రాజ్ పురస్కార ప్రదాత క్యాతం సంతోష్ కుమార్ మాట్లాడుతూ పుస్తక పఠనంతో జీవితాలు ఎలా ఉజ్వలమవుతాయో తమ తల్లిదండ్రులు నేర్పారని అందుకే ఈ స్థాయిలో ఉన్నామని అందుకే తాము సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ భాషలో కవితా రచన పోటీలు నిర్వహిస్తామని, తెలుగు మాండలికాలలో రాసిన కథా సంపుటాలకు పోటీలకు ఆహ్వానించి నగదు ప్రోత్సాహకాలను అందిస్తామని భవిష్యత్ కార్యాచరణ తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న పంచ రెడ్డి లక్ష్మణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనూ, తెలంగాణలో సాహిత్య వికాసంలో హరిదా రచయితల సంఘం పాత్ర గణనీయమన్నారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన ఇందూర్ అన్నమయ్య వీ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఎక్కడైతే సాహిత్యంలో నిరంతర కృషి జరుగుతుందో అక్కడ ప్రజలు చైతన్యవంతులుగా ఉంటారని, అక్కడ ప్రగతి తో పాటు నైతిక విలువల ఉద్దీపన కొనసాగుతుందని అన్నారు. తెలుగు సాహిత్యంలో హరిదా పాత్ర అమోఘం అన్నారు. జిల్లాస్థాయి హరిదా సరస్వతీ రాజ్ పురస్కారాలను అన్యం పద్మజా రెడ్డి, కామినేని రేణుక, మఠం సుజాత, పి లక్ష్మణ్, మల్లవరపు చిన్నయ్య లకు అతిథులు బహుకరించారు. 40 మంది కవులతో కవి సమ్మేళనం అలరించింది. ఈ కార్యక్రమంలో దారం గంగాధర్ రచించిన సమాంతర రేఖల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీనివాస్ ఆర్య, డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, డాక్టర్ కాసర్ల నరేష్ రావు, డాక్టర్ గంట్యాల ప్రసాద్, జి నరసింహస్వామి, నరాల సుధాకర్, కందకుర్తి యాదవరావు, డాక్టర్ శిరీష్, డాక్టర్ సవితా రాణి, జిల్లా సాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.