
– జై గౌడ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పండరి గౌడ్
నవతెలంగాణ -పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలో ఈ రోజు జై గౌడ సంఘం సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జై గౌడ సంఘం కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పండరి గౌడ్ మాట్లాడుతూ.. 2022- 23 విద్యా సంవత్సరం పదవ తరగతి ఫలితాలలో 10 జీపీఏ సాధించిన, ఇంటర్మీడియట్‌లో రాష్ట్రస్థాయి 20వ ర్యాంకు సాధించి కామారెడ్డి జిల్లాకు చెందిన గౌడ విద్యార్థిని విద్యార్థులకు జై గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు ఇవ్వనున్నట్లు జిల్లా కమిటీ నిర్ణయించింది. అర్హత కలిగిన విద్యార్థినీ విద్యార్థులు తమ వివరాలను 9440760879, 9492874011, 9177842777, 7981421185, 9640007129 నంబర్లకు పంపించి నమోదు చేసుకోవాలని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని SRK డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఈ నెల 9వ తేదీన ఆదివారం ప్రతిభ పురస్కారాల అవార్డులు బహుకరించనున్నట్లు తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జై గౌడ సంఘం జాతీయ అధ్యక్షులు వట్టికూడి రామారావు గౌడ్, ఉద్యమ సంఘాల నేత చక్రవర్తి గౌడ్, జై గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలు అనురాధ గౌడ్ లు హాజరవుతారన్నారని తెలిపారు. గౌడ సోదరులు, గౌడ విద్యార్థినీ విద్యార్థులు అవార్డు కార్యక్రమానికి అధిక సంఖ్యలో హజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు విఠల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, సభ్యులు బాలాగౌడ్, నవీన్ గౌడ్ పాల్గొన్నారు.