చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై అవగాహన: సీడీపీఓ

నవతెలంగాణ – రెంజల్

అంగన్వాడి కేంద్రంలోని చిన్నారుల ఆరోగ్య పరిస్థితిలపై అంగన్వాడీ టీచర్లకు సీడీపీఓ జానకి, ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణిలు అవగాహన కల్పించారు. బుధవారం రెంజల్ మండలంలోని వీరన్న గుట్ట పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి చిన్నారుల ఎత్తు, బరువు, చుట్టుకొలత లను ఏ విధంగా నిర్వహించాలనే అంశంపై 34 మంది అంగన్వాడి టీచర్లకు అవగాహన కల్పించారు. పీడీ ఆదేశాల మేరకు ప్రతి అంగన్వాడిలో ఫ్రీ స్కూల్ టైం టేబుల్ ప్రకారం ఆట పాటలతో అలరించాలని, చిన్నారుల ఎత్తు బరువులను కొలిసిన అనంతరం వారికి పౌష్టికమైన ఆరాన్ని అందించాలనే అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. ప్రతిరోజు నిర్వహించిన కార్యక్రమాల గురించి సంబంధిత జిల్లా అధికారులకు తెలియజేయాలని ఆమె పేర్కొంది. అనంతరం గ్రామంలోని రెండు అంగన్వాడి కేంద్రాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 34 మంది అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.