ముర్రుపాలు ప్రయోజనంపై బాలింతలకు అవగాహన

Awareness among infants on the benefits of milk thistleనవతెలంగాణ – అశ్వారావుపేట
నవజాత శిశువులకు ముర్రుపాలు పెట్టడం ద్వారా వారికి రోగనిరోధక శక్తి ని పెంపొందించుకోవచ్చు అని గుమ్మడి వల్లి పి.హెచ్.సి డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. తల్లిపాలు వారోత్సవాలను పురస్కరించుకుని ఐసీడీఎస్ సూపర్వైజర్ నాదెళ్ళ సౌజన్య మంగళవారం ఆ ఆసుపత్రిలో అపుడే కాన్పు అయిన బాలింతలకు ముర్రుపాలు పై అవగాహన కల్పించారు. నవజాత శిశువులకు పాలు పట్టే విధానం పై తల్లులకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎం లు ఉన్నారు.