బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన

నవతెలంగాణ – రెంజల్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బడిబాట కార్యక్రమాన్ని రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో గురువారం మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామంలోని ఉపాధ్యాయులందరూ ఇంటింటికి వెళ్లి బడి బాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగిందని వారు పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో పి ఆర్ టి ఓ మడల అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం గౌడ్, సాయి రెడ్డి, దూపల్లి పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు వెకటలక్ష్మి, ఉపాధ్యాయులు కే సాయన్న, శ్రీనివాస్, శ్రీధర్, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు సాయి ప్రియ తదితరులు పాల్గొన్నారు.