అమ్మ ఆదర్శ పాఠశాలలో చైర్మన్ లకు అవగాహన సదస్సు…

నవతెలంగాణ- రెంజల్

రెంజల్ మండలంలోని 18 పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్ లకు ఎంపీడీవో శంకర్, ఎంఈఓ గణేష్ రావు, కోఆర్డినేటర్ ఆంజనేయులు అవగాహన కల్పించారు. ఎస్ఎంసి కమిటీ చైర్మన్ లకు బదులుగా అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో పాఠశాలల మౌలిక సదుపాయాలకు ప్రత్యేక నిధులను కేటాయించనున్నట్లు వారు పేర్కొన్నారు. సోమవారం రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి శంకర్ ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మండలంలోని 18 పాఠశాలల్లో తాగునీటి సమస్య, మరమ్మత్తులు, టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ, సంబంధించిన అత్యవసరమైన పనులకు కేటాయించనున్నట్లు వారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్, సూపర్డెంట్ శ్రీనివాస్, పిఆర్టియు మండల అధ్యక్షులు సోమలింగం గౌడ్, పబ్లిక్ కి పి ఆర్ ఏ ఈ సాయిచంద్, ఏపిఎం చిన్నయ్య, బి. వెంకటలక్ష్మి. రేఖ, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్లు, ఎమ్మార్పీలు, పాల్గొన్నారు..