విత్తనాల కొనుగోలు పై రైతులకు అవగాహన సదస్సు: ఏఓ రవీందర్

నవతెలంగాణ – మోపాల్

మోపాల్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున మండల వ్యవసాయ అధికారి రవీందర్, ఏ ఈ ఓ చక్రపాణి ఆధ్వర్యంలో రైతుల కొనుగోలు చేసే విత్తనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ రైతులు విత్తనాలను  కొనుగోలు చేసే సందర్భంలో ఖచ్చితంగా రసీదు పొందాలని, ఆ రసీదును మరియు విత్తన బ్యాగులను పంట కాలం పూర్తయ్యే వరకు కూడా భద్రపరుచుకోవాలని అలాగే, లూజుగా ఉన్న విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనవద్దని, వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన లైసెన్సు ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలను కొనుగోలు చేయాలని ప్యాక్ చేసిన మరియు లేబుల్ కలిగిన విత్తనాలను కచ్చితంగా కొనుగోలు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. నకిలీ విత్తనాలను అరికట్టాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  రైతులు తదితరులు పాల్గొన్నారు.