కుష్ఠువ్యాధి నిర్మూలనకు అవగాహన సదస్సు

నవతెలంగాణ – పెద్దవూర
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం  మండలం లోని పెద్దగూడెం జెడ్పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల లో జాతీయకుష్టు వ్యాధి నిర్మూలనపై విద్యార్థులకు పెద్దవూర ఆరోగ్య కేంద్రం సిబ్బంది అవగాహన కల్పించారు. వారితో కుష్టు వ్యాధి గురించి వివరించి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్ వైజర్ స్లీవమ్మ,  మాట్లాడుతూ..నా కుటుంబంలో లేదా పొరుగు వారిలో లేదా ఈ సమాజంలో ఎవరికైనా చర్మంపై స్పర్శ కోల్పోయిన వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. మచ్చలు ఉండి వాటిని తాకినప్పుడు లేదా దాని మీద నొప్పి కలిగించినప్పుడు, తెలియకపోతే వారిని సమీప ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ను సంప్రదించాలని కోరారు. వ్యాధి నిర్ధారణ చేసుకొని తగిన చికిత్స తీసుకోవాలన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులను కుష్టు వ్యాధి కారణంగా అంగవైకల్యం ఏర్పడిన వారి పట్ల శ్రద్ధ వహించాలని, వారిని సమీపంలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి చికిత్స తీసుకునేలా ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్ పి శరణ్య, ఆశా కార్యకర్తలు, ధనమ్మ, విమల, వెంకటమ్మ, ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు  మారం రవీందర్, అశోక్, రామాంజి రెడ్డి,  గౌసోద్దీన్, సుదర్శన్, దేవేందర్, కరుణ పాల్గొన్నారు.