నవభారత్ లో అవగాహన సదస్సు

నవతెలంగాణ – భువనగిరి
రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణ ఆస్తి మొత్తం జరగడంతో పాటు సమాజానికి కుటుంబానికి తీరని లోటు అని జిల్లా డీటీఓ అధికారి జి రవీందర్ తెలిపారు. సోమవారం స్థానిక శ్రీ నవభారత కళాశాలలో రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు లైసెన్సీ లేకుండా వాహనం నడుపరాదన్నారు. అది  చట్టరీత్యా నేరమన్నారు.  హెల్మెట్ ధరించకుండా వాహనం ఎట్టీ పరిస్థతిలోనూ నడుపరాదన్నారు,  రాంగ్ రూట్లో వాహనం నడుపకాదన్నారు. చిన్న అజాగ్రత్తనే ప్రాణానికి ముప్పు కలుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎలాంటి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అది సమాజానికి నష్టం కలిగిస్తుంది అన్నారు. ఈ కార్యక్ర మంలో కళాశాల ప్రాన్సిపాల్ సిహెచ్. ప్రభాకర్, వైస్ ప్రిన్సిపాల్ జి. ఎల్లేష్, సంతోష్, నరేందర్ పాల్గొన్నారు.