సమస్యాత్మక గ్రామాల్లో అవగాహన సదస్సు

నవతెలంగాణ- ఆత్మకూరు: ఆత్మకూరు ఎస్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో   ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల పరిధిలోని సమస్యాత్మక గ్రామాలైన ఏపూర్, రామన్నగూడెం, కందగట్ల గ్రామాలను సందర్శించి ఆయా గ్రామాలలో ఎస్సై వెంకట్ రెడ్డి మాట్లాడుతూ  ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని, ఎటువంటి అల్లర్లు, గొడవలు, తావులేకుండా ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేసుకునే విధంగా గ్రామస్తులకు అవగాహన కల్పించటం జరిగినది. ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో పెట్టే పోస్టింగ్ ల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని ఇతరుల పార్టీలు, వ్యక్తుల  మనోభావాలు దెబ్బతినే విధంగా,  రెచ్చగొట్టే విధంగా, కించపరిచే ఎవరైనా పోస్టింగులు పెట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది. గ్రామాల్లో ఎలాంటి ఘర్షణలకు, వివాదాలకు తావులేకుండ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ఎస్ఐ వెంకటరెడ్డి కోరారు.