డెటాల్ బనేగా స్వస్త్ ఇండియా ప్రోగ్రాం లో భాగంగా గ్రామాలయ, కార్పెడ్ సంస్థల ఆధ్వర్యంలో శనివారం తాడ్వాయి మండలంలోని సెకండరీ పాఠశాలలోని విద్యార్థులకు కార్పెడ్ సంస్థ ప్రతినిధి ఎండి షఫీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చేతి శుభ్రత గురించి వివరించి చేతులు ఎప్పుడెప్పుడు కడిగాలి, కడిగే విధానం తెలిపి, విద్యార్థులందరికీ ఉచితంగా డెట్టాల్ సబ్బులను మండల విద్యాశాఖ అధికారి రేగ కేశవ రావు గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అలాగే విద్యార్థులచే స్వచ్ఛ విద్యాలయ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రేగా కేశవరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్పెడ్ సంస్థ ప్రతినిది ఎండీ షఫీ తదితరులు పాల్గొన్నారు.