ఆశా డే సందర్భంగా అవగాహన సదస్సు 

నవతెలంగాణ-రామారెడ్డి 
మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఆశాల దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా సాధికారిక సిబ్బంది శారద జెండర్ స్పెషలిస్ట్ ఆశలకు, బాలింతలకు, మహిళలకు అవగాహన కల్పించారు. బేటి బచావో, బేటి పడావో, స్త్రీ పురుషుల వివక్షత పై, గృహహింస, పని ప్రదేశంలో లైంగిక వేధింపులు, గర్భ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం, పై అవగాహన కల్పించారు. స్త్రీలు ఏ హింసకు గురికాకూడదని మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. ఆపదలో హెల్ప్ లైన్ నెంబర్ 181 సఖీ సేవలు వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పిహెచ్సి వైద్యులు సురేష్, హెచ్ఈఓ భీమ్, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.