మహిళా శక్తి కార్యక్రమాల పైన అవగాహన సదస్సు 

Awareness Conference on Women Empowerment Programmesనవతెలంగాణ – జక్రాన్ పల్లి 

నిజాంబాద్ పట్టణంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో మహిళా శక్తి కార్యక్రమాల పైన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిర్వహించారు. నిజాంబాద్ జిల్లాలోని అన్ని మండల సమైక్యాల అధ్యక్షురాలతో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లతో మహిళా శక్తి కార్యక్రమాల పైన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సోషల్ మెబ్బులైజేషన్ కింద సంఘాలలో లేని వారిని మహిళా సంఘాల్లో చేర్చాలని అన్నారు. ప్రతి గ్రామ సంఘంలో కొత్తవి ఆదాభివృద్ధి కార్యక్రమాలను మరియు పాత ఆదయ అభివృద్ధి కార్యక్రమాలకు బ్యాంకు ద్వారా రుణాలు అందజేసి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్నారు. అదేవిధంగా పాడి గేదెలకు రుణాలు ఇస్తూ బయట రాష్ట్రం నుంచి కొనుగోలు చేసి ఇస్తే పాల ఉత్పత్తి పెరుగుతుందని పేర్కొన్నారు. నాటు కోళ్ల పెంపకానికి రుణాలు అందజేసి మహిళలకు చిన్నపాటి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మీ సేవ లేని గ్రామాలను గుర్తించి ప్రతిపాదించిన గ్రామ సంఘాలు మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. చిన్న వ్యాపారాల కింద ఫుడ్ ప్రాసెస్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి ఆర్ డి ఏ పిడి సాయ గౌడ్, ఏపిడి రవీందర్, డిపిఎంలు జిల్లాలోని అన్ని మండల సమైక్యాల అధ్యక్షురాలు ఏపిఎంలు తదితరులు పాల్గొన్నారు.