– తొర్రూర్ డి.ఎస్.పి సురేష్
నవతెలంగాణ – నెల్లికుదురు
నవతెలంగాణ – నెల్లికుదురు
మహిళల భద్రత, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, మత్తు పదార్థాల,పై పూర్తిస్థాయిలో అవగాహన సదస్సును నిర్వహించినట్లు తొర్రూరు డిఎస్పి సురేష్ తెలిపారు మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేక ఆదేశానుసారంగా అడిషనల్ ఎస్పీ చెన్నయ్య ఆధ్వర్యంలో, ఆదర్శ పాఠశాల బాలికల ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్,Govt జూనియర్ కాలేజ్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల విద్యార్థులకు సీఐ జగదీష్ తో కలిసి మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా షీ టీం అవగాహన కార్యక్రమం నందు తొర్రూర్ డిఎస్పీ సురేష్ సర్, సైబర్ క్రైమ్ సీఐ జగదీష్ , నెల్లికుదురు Si చిర రమేష్ బాబు , షీ టీం ఎస్సై సునంద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో షీ టీం గురించి వివరిస్తూ విద్యార్థులందరూ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అపరిచిత వ్యక్తులతో ఫోన్ కాల్స్ గాని వాట్సాప్ కాల్ గాని మాట్లాడవద్దని అపరిచిత వ్యక్తులు కానీ అపరిచిత గ్రూపుల నుండి వచ్చినటువంటి ఆన్ కాన్ లింకులను ప్రెస్ చేయవద్దని వివరిస్తూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు, దీనిలో భాగంగా మహిళలు ఆపద సమయంలో డయల్100,షీ టీమ్ నెంబరును సంప్రదించాలని అన్నారు. ఆడవాళ్ళు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినపుడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి టి సేఫ్ యాప్ ను ప్రతి ఒక్క మహిళ ఉపయోగించుకోవాలని,ఏదైనా సమస్య వచ్చినప్పుడు మౌనంగా భరించ కుండా ముందుకు వచ్చి షీ టీమ్ ని సంప్రదించి, వారి సమస్యలను పరిష్కరించుకొవాలని అన్నారు. ప్రత్యేకంగా చిన్న పిల్లలకు గుడ్ టచ్,బ్యాడ్ టచ్ మీద అవగాహన కల్పించాలని అవసరమైన ఆత్మ రక్షణ విద్యలను నేర్చుకోవాలి అని సోషల్ మీడియాను వాడుతున్న వారు వాటి పరిధి ని తెలుసు కోవాలని అపరిచిత వ్యక్తులతో మాట్లాడరాదని, ఒక వేళ సోషల్ మీడియా లో హరాస్మెంట్, సైబర్ క్రైమ్ కు గురి అయితే తక్షణమే షీ టీమ్ కానీ,పోలీసులకు కానీ సంప్రదించాలని తెలిపారు.
షీ టీం ను సంప్రదించడానికి క్యూ ఆర్ కోడ్ విధానాన్ని ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ఉపయోగించుకోవాలని,అలాగే సోషల్ మీడియా లో కూడా షీ టీం ను సంప్రదించవచ్చని తెలియచేయడం జరిగినది. అంతేకాకుండా మానవ అక్రమ వివాహ రవాణా, ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ క్యూఆర్ కోడ్ పిటిషన్ మరియు సైబర్ నేరాల అండ్ సైబర్ సెక్యూరిటీ సేవలు,1930, డయల్ 100 మరియు ఫోక్సో చట్టాల గురించి బాల్య గురించి 1500 మంది విద్యార్థినీలకు అవగాహన కల్పించడం ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా అమ్మాయిలు వివిధ గ్రామాల నుండి వస్తుంటారు. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని తమ వ్యక్తిగత విషయాలను వ్యక్తిగత ఫోటోలని సోషల్ మీడియాలో గాని, ఇతరులకు గాని షేర్ చేయొద్దని.. అట్టి ఫోటోలను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంటుంది, కావున తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ ఎవరైనా అలా బ్లాక్మెయిల్ చేసినట్లయితే పరువు పోతుందని భయపడకుండా షీ టీమ్ ని సంప్రదించాలని… షీ టీం కి కంప్లైంట్ చేసినట్లయితే కంప్లైంట్ యొక్క వివరాలు గొప్యం గా ఉంచబడతాయని, బాధితురాలు షీ టీమ్ ఆఫీస్ కి రాలేని పక్షంలో షీ టీం సభ్యులే వారి దగ్గరికి వెళ్తారని కావున ఎలాంటి భయం లేకుండా కంప్లైంట్ చేయాలని, షీ టీమ్ వాట్స్ అప్ నంబర్స్ 8712656935, 7901142009 కి తెలియచేసిన చో తగిన చర్య తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది ఏఎస్ఐ ఆనందం డబ్ల్యూ ఈ సి పార్వతి సిబ్బంది సుప్రజా జయశ్రీ రేణుక తదితరులు పాల్గొన్నారు.