హౌటళ్లకు బ్యాలెట్‌ యూనిట్‌పై అవగాహన

– కలెక్టర్‌ సి నారాయణరెడ్డి
నవతెలంగాణ- వికారాబాద్‌ కలెక్టరేట్‌
జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల లోని అన్ని గ్రామాల్లో ఓటర్లకు బ్యాలెట్‌ యూనిట్‌, వీవీ ప్యాడ్‌, కంట్రోల్‌ యూనిట్లపై సోమవారం నుండి అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాల యం వద్ద ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల ప్రదర్శన కేంద్రాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఆయన మాట్లా డుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఓటింగ్‌ యంత్రాలపై ఓటర్లకు అవగాహన కల్పించా లనే ఉద్దేశంతో జిల్లాలోని నాలుగు నియోజకవర్గా లలోని ఆర్‌.ఓ కార్యాలయాలలో లేదా తహసీల్దార్‌ కా ర్యాలయాలతో పాటు కలెక్టర్‌ కార్యాలయంలో ఎల క్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల ప్రదర్శన కేంద్రాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. నాలుగు నియోజకవర్గాలలోని అన్ని గ్రామాల్లో మొబైల్‌ వ్యాన్‌ల ద్వారా రోజు రెండు గ్రా మాల చెప్పన ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ప్రతి నియోజకవర్గానికి నాలుగు మొబైల్‌ వాహనాల చొప్పున ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ రోజు ఏ విధంగా ఓటు వేయాలో అనే అంశంపై మాక్‌ పోలిం గ్‌ నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పించ నున్నట్లు తెలిపారు. ఓటర్లు ఇట్టి కేంద్రాల ద్వారా అవగాహన పెంచుకోవాలని సూచించారు. వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా బ్యాలెట్‌ కంట్రోల్‌ చారన్నారు. జిల్లా మొత్తంలో 21 ఈవీఎం ల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఎలక్షన్‌ డిప్యూటీ తహసీల్దార్‌లతో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 6 గంటల వరకు రెండు షిఫ్టులలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఓటర్లకు అవగాహన కల్పించి మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలన్నారు. ప్రతిరోజు సాయం త్రం సమీప పోలీస్‌ స్టేషన్‌ లో ఓటింగ్‌ యంత్రాలను భద్ర పరచాలని సూచించారు. నియోజకవర్గాల వారీ గా కేటాయించిన వాహనాలలో మాత్రమే ఓటింగ్‌ యంత్రాలను తీసుకుని వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకూ తావు లేకుండా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) లింగ్యా నాయక్‌, వికారాబాద్‌ ఆర్డీవో విజయ కుమారి, తహసీల్దార్‌ రాజేందర్‌ రెడ్డి, ఎలక్షన్‌ డి టి రవీందర్‌ దత్తు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.