బ్యాంకు సేవలు,సౌకర్యాలపై అవగాహన

నవతెలంగాణ-మల్హర్ రావు : మండల కేంద్రమైన తాడిచెర్లలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ ఆధ్వర్యంలో కాపురం గ్రామంలో బ్యాంకు సేవలు,సౌకర్యాలు,ఆర్థిక,అక్షరాస్యతపై  ఎంవి రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ కళాజాత వారిచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడారు బ్యాంకు పథకాలు,బ్యాంకు స్కీమ్స్ పై రైతులకు క్రాఫ్ లోన్లు, పొదుపు మహిళలకు పొదుపులోన్లు ఎడ్యుకేషన్ లోన్లు హౌసింగ్ లోన్ వాహన లోన్లు గోల్డ్ లోన్లు, సామాజిక భద్రత పథకాలు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన అటల్ పెన్షన్ యోజన, నగదు రహిత లావాదేవీలు, సైబర్ మోసాలపై మాటల ద్వారా పాటల ద్వారా మ్యాజిక్ షో ద్వారా ప్రజలకు అర్థమైనటువంటి రూపకంగా తెలియజేసీనట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఈ కార్యక్రమమునకు బ్యాంకు సిబ్బంధి , కళాజాత బృందం సభ్యులు  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.