
మండలంలోని బషీరాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం సర్పంచ్ సక్కారం అశోక్ అధ్యక్షతన వికాసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టి అమలుపరుస్తున్న అన్ని పథకాలపై అధికారులు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడాలని అధికారులను కోరారు. కేంద్రం నుండి అందించే సంక్షేమ పథకాలు పొందాలంటే ఆయా శాఖకు సంబంధించి వివరాలను గ్రామ కార్యదర్శిని సంప్రదించి అర్హులైన వారందరూ ధరకాస్తు చేసుకొని లబ్ధి పొంది ఆర్థికంగా నిలదొక్కు కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం క్యాలెండర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఆంజనేయులు, మండల పంచాయతీ అధికారి సదాశివ్పీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శరత్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి పద్మ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచి మేనేజర్ నవీన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్, చౌట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు సత్యనారాయణ, ఆరోగ్య శ్రీ ముత్తెన్న, ఎంపీటీసీ సభ్యురాలు జ్యోతి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉపసర్పంచ్ విక్రమ్, వార్డు సభ్యులు నీలిమ, గిరిజ, లావణ్య, శారద, విజయ, వివిధ శాఖల మండల, గ్రామస్థాయి అధికారులు,ఐకెపి సిసి భాగ్య, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, విఓఏ లు, నాయకులు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.