
మండలంలోని భాగిర్థిపల్లి, భిక్కనూర్ గ్రామాలలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సమస్త సిసి శ్రీవిద్య వంశీకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు కౌమార దశలో వచ్చే మార్పులు, రక్తహీనత, పిల్లల సంరక్షణ చట్టాల గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దుర్గారెడ్డి, రేఖ , ఊర్మిళ, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.