పిల్లల ఆహార అలవాట్లపై అవగాహన

నవతెలంగాణ- రామారెడ్డి : మండలంలోని రెడ్డి పేట లో మంగళవారం అంగన్ వాడి కిశోర బాలలకు, తల్లులకు ఆహార అలవాట్లపై యుని సేవ్ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అంగన్వాడీలో అక్షరాభ్యాసం, అన్న ప్రసన్న నిర్వహించారు. కార్యక్రమంలో యునిసేవ్ కోఆర్డినేటర్, సిడిపిఓ శ్రీలత, సూపర్వైజర్ ఉమా, ఆశాలు, అంగన్వాడీ టీచర్, సిబ్బంది, తల్లులు తదితరులు పాల్గొన్నారు.