సైబర్ అవేర్ నెస్ పై అవగాహన

నవతెలంగాణ –  నిజాంసాగర్

నిజం సాగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ అవేర్ నెస్  పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ సఫ్ధర్ ఆలీ మాట్లాడుతూ.. ఈరోజులలో ఆన్లైన్ మోసాలు ఎక్కువ అయ్యాయి అని, దానిపట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి పడితే వారికి ఓటీపీలు చెప్పవద్ద,ని అలాగే చరవాణిలోకి వచ్చే లింకులను ఎట్టి పరిస్థితులలో ఓపెన్ చేయకూడదని ఆయన సూచించారు. బ్యాంకు నుండి మాట్లాడుతున్నాం, అని మీకు లక్ష రూపాయల వరకు లోన్ సాంక్షన్ అయిందని, దాని అప్రూవల్ కోసం ఓటిపి చెప్పాలని ఆన్లైన్ మోసగాళ్లు బురిడీ కొట్టిస్తారని ఆయన అన్నారు. మీకు ఎలాంటి సమాచారం అయినా బ్యాంకుకు వెళ్లే నిర్ధారణ చేసుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట కానిస్టేబుల్స్ సాయిలు, బాలరాజ్, హరిబాబు మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.