నవతెలంగాణ – మోర్తాడ్
మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో ఎస్సై అనిల్ రెడ్డి బుధవారం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం విద్యాసంస్థల ముగుస్తున్న సమయంలో విద్యార్థులు ఇంటి వద్ద ఫోన్ లకు అలవాటు పడి సైబర్ వలలో చిక్కకుండా ఉండడానికి పలు సూచనలను సలహాలను ఇచ్చారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపించిన మెసేజ్లను కానీ ఓటీపీలు ఎవరికి చెప్పవద్దని అలాంటి వాటిపై తగు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ వాటిలో చిక్కుకొని చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారని విలువైన సమాచారంతోపాటు డబ్బులను పోగొట్టుకోవడం జరుగుతుందని విద్యార్థులు ఫోన్ యూస్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలని విద్యార్థులకు తెలిపారు.