
నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేటలో గల యూనియన్ బ్యాంక్ ఆవరణలో బుధవారం రోజు ఏఎస్ఐ లచ్చిరాం సిబ్బందితో కలిసి బ్యాంక్ ఖాతాదారులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన పలు జాగ్రత్తలు వివరించారు గుర్తు తెలియని వ్యక్తులు పంపినటువంటి లింకులను ఓపెన్ చేయకూడదని వారు సూచించారు. సెల్ఫోన్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ సి పెంటయ్య, , మహేష్ శివ, మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.