మహిళలు, చిన్నపిల్లలపై జరిగే అగాయిత్యాలు, సైబర్ నేరాలపై అవగాహన..

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నందు సైబర్ నేరాల గురించి, మహిళలపై మరియు చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాల గురించి, కొత్త చట్టాల గురించి అలాగే రోడ్డు ప్రమాదాల గురించి గాంధారి ఎస్ ఐ ఆంజనేయులు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు మొబైల్ ను వాడకూడదని, ఈ వయసులో మొబైల్ అవసరం లేదని, దానివల్ల జరిగే పరిణామాల గురించి, షీ టీం యొక్క ప్రాముఖ్యత, పాఠశాల నందు ధైర్యంగా ఉండాలని, పాఠశాల నందు ఎలాంటి సమస్య ఉన్న టీచర్లకు గాని, టీచర్ల ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వగలరని తెలిపారుఈ కార్యక్రమంలో  ఎస్.ఐ ఆంజనేయులు,  ఏ ఎస్ ఐ గణేష్, సిబ్బంది, ప్రిన్సిపాల్ శిల్ప సిబ్బంది విద్యార్థులు  పాల్గొన్నారు.