– ఎస్సై కనుకుల క్రాంతి కిరణ్ ఆదేశాల మేరకు
– ఏఎస్ఐ గుంటుక యాకన్న
నవతెలంగాణ- నెల్లికుదురు
సామాజిక అంశాలు, సైబర్ నేరాలు, మహిళల భద్రత పై అవగాహన కార్యక్రమాన్ని నెల్లికుదురు ఎస్సై కనుకుల క్రాంతి కిరణ్ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నెల్లికుదురు ఏఎస్ఐ గుంటుక యాకన్న తెలిపారు మండల కేంద్రంలోని ప్రభుత్వ గౌట్ హైస్కూల్ జడ్పీఎస్ హైస్కూల్ ఆదర్శ పాఠశాల కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఆయా పాఠశాల హెచ్ఎం లతో కలిసి విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ముఖ్యంగా సైబర్ నేరాలకు మోసపోవద్దని చెప్పారు సామాజిక అంశాలపై సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు మీ మొబైల్లో తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని డబ్బులు ఆశ చూపించి లేనిపోని మాటలు చెప్పి మిమ్ములను మోసపెట్టే విధంగా వారు పక్కా ప్రణాళిక తయారు చేసుకొని మీకు వాట్సాప్ లో ఏదో ఒక మెసేజ్ పంపించి మిమ్ములను ఓటిపి వచ్చింది మీకు ఏదో ఒకటి వస్తుందని మోసగించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని వాటికి ఎవరు కూడా మోసపోవద్దని ఎవరు ఓటిపి అడుగుతే చెప్పవద్దని అన్నారు అలా చెప్పినట్లయితే మనం వారి చేతిలో మోసపోవడం తప్ప వేరేది లేదని అన్నారు మహిళల భద్రతపై అవగాహన కలిగి ఉండి ఉండే విధంగా కృషి చేయాలని అన్నారు మిమ్మల్ని ఎవరైనా మోసగించే ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు సామాజిక అంశాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండడం పట్ల మేలు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ ఎన్ యాక స్వామి రమాదేవి శిరీష తోపాటు ఆయా పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు