ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలకై అవగాహన..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి  మండల కేంద్రం లోని ఘనపూర్ గ్రామంలో గల సిఎస్ సి ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీ లతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవిస్తే కలుగు ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి నట్లు మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ అన్నారు. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించేలా చూడాలని ఆశ కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో పల్లె దవాఖాన ఎంఎల్ హెచ్ పి గంగాభవాని, ఎంఎన్ఎస్ లు గొల్లపల్లి శైలజ, రజిత, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు బాలింతలు పాల్గొన్నారు