విద్యపై అవగాహన

– ప్రథంసంస్థ స్టేట్‌ హెడ్‌ రాంబాబు
నవతెలంగాణ-పరిగి
ప్రథం సంస్థ ఆధ్వర్యంలో విద్యపై అవగాహనా సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రథం సంస్థ స్టేట్‌ హెడ్‌ రాంబాబు అన్నారు. మంగళవారం పరిగి మండల పరిధిలోనీ నిజారాభద్‌ తండాలో విద్యార్థులు తన విద్యాభివద్ధికి చెందడం కోసం వేసవి శిబిరాలలో భాగంగా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు అవగాహన కల్పించారు. అన్ని సామర్థ్యాలు అభివద్ధి చెందడం కోసం తల్లిదండ్రులు తమ వంతు బాధ్యతను నెరవేర్చాలని కోరుతూ అదేవిధంగా పిల్లలకు చదివే మార్గాన్ని వారి విద్యాభివద్ధికి ముందు మనమే బాధ్యత తీసుకోవాలని కోరడం జరిగింది. అదేవిధంగా విద్యాభివద్ధి బాగుంటేనే సమాజ అభివద్ధికి తోడ్పడడానికి కారణం అవుతారు. దీనికోసం వంతుగా మండలంలోని 25 గ్రామాలకు కథల పుస్తకాల కిట్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతీ విద్యార్థి ఒకటి నుండి 5వ తరగతి గల విద్యార్థులు పుస్తక సామర్ధ్యాలను అలవర్చడం కోసం దశల వారి కథలను చదవాలని కోరారు. కార్యక్రమానికి ప్రోగ్రాం హెడ్‌ సుధాకర్‌, మండల విద్యాధికారి హరిచంద్ర, ప్రధానోపాధ్యాయుడు వీరేశం, ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌, డిస్టిక్‌ కోఆర్డినేటర్‌ వెంకటయ్య, మండల కోఆర్డినేటర్లు వినోద్‌, మురళీకష్ణ తల్లిదండ్రులు పాల్గొన్నారు.