పెద్దగుండవెళ్లి రైతువేదికలో ఫామాయిల్ పై అవగాహన

– హార్టీకల్చర్ అధికారి ఆర్ బాలాజీ
నవతెలంగాణ -దుబ్బాక రూరల్ 
ఫామాయిల్ సాగుతో రైతులు అధిక లాభాలు గడించవచ్చని దుబ్బాక ఆయిల్ ఫామ్ హార్టీకల్చర్ అధికారి ఆర్ బాలాజీ తెలిపారు. శుక్రవారం దుబ్బాక మండల పరిధిలోని పెద్దగుండవెళ్ళి గ్రామంలోని  రైతు వేదికలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ఉన్న రైతులంతా తప్పనిసరిగా ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవాలని కోరారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు బంగారు భవిష్యత్ తో పాటు అధిక లాభాలు ఉంటాయన్నారు. ఒక ఎకరానికి సరిపడా నీటితో 5 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవచ్చని రైతులకు సూచించారు. తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు . ప్రభుత్వం సబ్సిడీతో మొక్కలు ఇచ్చి డ్రిప్ సౌకర్యం కల్పిం చడంతో పాటు అనునిత్యం ఆయిల్ ఫామ్ సాగును  పరిశీలిస్తుమన్నారు.నంగునూరులో ఫామాయిల్  ఆయిల్ తోటలలో గేలలు  స్టార్ట్ అవుతున్నాయని అన్నారు. రైతులకు రాయితీ సౌకర్యాన్ని కల్పిస్తుందని తెలిపారు. ఇప్పటికే  పెద్దగుండవెల్లి గ్రామంలో  ఫామాయిల్ సాగు తీరు బాగుందని, మరింత మంది గ్రామ  రైతులు సాగు చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో పలువురి రైతులకు కలిగిన సందేహాలను నివృత్తి చేశారు. దుబ్బాక మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ , ఎంపీటీసీ పరికి రవి, సర్పంచ్ సద్ది రాజిరెడ్డి , ఏఎంసీ డైరెక్టర్ చిన్ని సంజీవ్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు నక్కల నక్కల రాఘవ రెడ్డి, ఆయిల్ ఫీల్డ్ ఆఫీసర్ రాకేశ్, ఏఈవో అరుంధతి, సిఎస్ఏ ప్రతినిధి శ్రీశైలం , రైతు సంఘం సీఈవో కే . యాదగిరి ,గ్రామ రైతులు ఉన్నారు
పెద్దగుండవెళ్లి రైతువేదికలో ఫామాయిల్ పై అవగాహన
సభ్యత్వాలు నమోదు చేసుకుంటే రైతులకు మేలు 
సిఎస్ఏ ప్రతినిధి శ్రీశైలం 
దుబ్బాక మండల పరిధిలోని పెద్దగుండవెల్లి గ్రామ రైతు వేదికలో  శుక్రవారం రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిఎస్ఏ ప్రతినిధి శ్రీశైలం మాట్లాడుతూ రైతు సంఘంలో సభ్యత్వాలు నమోదు చేసుకుంటే రైతులకు జరిగే లాభాల నష్టాలపై గురించి అవగాహన కల్పించామన్నారు. వర్షాకాలంలో కావేరి చింటు (సన్న రకం) వరిని రైతులు సాగు చేస్తే  ఆ కంపెనియే రైతు నుంచి క్వింటాల్ 2500/- రూ .. చొప్పున కొనుగోలు చేయనుందని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దుబ్బాక మండల ఉద్యాన , వ్యవసాయాధికారులు ,ప్రజా ప్రతినిధులు రైతు సంఘం సీఈవో కే . యాదగిరి,రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు నక్కల నక్కల రాఘవ రెడ్డి, గ్రామ రైతులు నిమ్మ సత్తి రెడ్డి , దామోదర్ రెడ్డి , స్వామి , ముత్యం రెడ్డి ,పెంటి కిషన్ , మల్లేశం , బుచ్చగౌడ్ తదితరులున్నారు.