– తోర్నాల ప్రధాన శాస్త్రవేత్త, అధిపతి డా. ఎస్. శ్రీదేవి
నవతెలంగాణ – తొగుట
అధిక సాంద్రత ప్రత్తి సాగు వలన ఎకరానికి 25000 మొక్కలు పెరగడం వలన అధిక దిగిబడు లు సాధించవచ్చని తోర్నాల ప్రధాన శాస్త్రవేత్త, అధిపతి డా. ఎస్. శ్రీదేవి తెలిపారు. శనివారం వ్యవసాయ పరిశోధన స్థానం, ఏరువాక కేంద్రం, తోర్నాల ఆధ్వర్యంలో యాంత్రిక పద్దతిలో అధిక సాంద్రత ప్రత్తి నాటడంపై (హెచ్డిపిఎస్ ఇన్ కాటన్) బండారుపల్లి గ్రామాము లో క్షేత్ర ప్రదర్శన నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త మాట్లాడుతూ యాంత్రిక పద్దతిలో అధిక సాంద్రత ప్రత్తి సాగు కోసం, ఒక వరుసలో మొక్కల మధ్య దూరం 20 సెo.మీ. వరుసల మధ్య దూరం 90 సెo.మీ. నేల స్వభావాన్ని బట్టి విత్తడం చేస్తామని తెలిపారు. అదేవిధంగా, సుమారుగా ఒక ఎకరం వేయడానికి 4-6 కూలీలు అవసరం అవుతుంది, ఈ యాంత్రిక పద్దతిలో నాటిన అధిక సాంద్రత ప్రత్తి నాటడం వలన అర గంటలో వేయవచ్చని వివరిం చారు. రోజుకు 9-10 ఎకరాల వరకు విత్తుకోవచ్చ ని సూచించారు. అధిక సాంద్రత ప్రత్తి సాగు వలన ఎకరానికి 25000 మొక్కలు పెరగడం వలన అధిక దిగిబడులు సాధించవచ్చని వివరించారు. ఈ పద్ద తిలో నాటడం వలన ప్రత్తిని 4 నుంచి 5 సార్లు తీయడం కాకుండా ఒకే సారి ప్రత్తిని తీయవచ్చని అన్నారు. ఈ పద్ధతి లో మెపిక్వాట్ క్లోరైడ్ అనే మందును 50 నుండి 75 రోజులకు 1 మి. లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయడం వలన మొక్కలు అధికంగా పెరగకుండా నిలువరిస్తుం దని తెలిపారు. తదుపరి పంటలలో నీటి సంరక్షణ పద్ధతులు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు గురించి వ్యవసాయ శాస్రవేత్తలు డా. విజయ్, డా. సి.హెచ్.పల్లవి క్లుప్తంగా వివరించారు. ఈ కార్య క్రమంలో సిద్దిపేట జిల్లాలో ప్రత్తి సాగు చేస్తున్న రైతులు పాల్గొన్నారు. ఈ పద్ధతిని గత రెండు సంవత్సాలుగా వ్యవసాయ పరిశోధనా స్థానం, ఏరువాక కేంద్రం వారిచే సిద్దిపేట జిల్లా రైతుల పొల ల్లో పీనేఉమాటిక్ ప్లంటర్ తో వేయించి నప్పుడు 10 నుండి 12 క్వింటన్ల దిగుబడి రావడంతో పాటు గులాబి రంగు పురుగు ఉదృతి తక్కువగా ఉంటుం దన్నారు. పత్తి తర్వాత పొద్దుతిరుగుడు, మొక్క జొన్న పంటలు సాగు చేయుటం కోసం అను కూలంగా ఉంటుందని పేర్కొన్నారు.