పంటల సంరక్షణపై రైతులకు అవగాహన

 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

రైతులకు వివిధ పంటల దిగుబడి, పంటల సంరక్షణపై మంగళవారం హుస్నాబాద్ రైతు వేదికలో డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలల రైతులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ఉద్యానవన పంటలు, వరి పంటలలో సందేహాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు.