భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలో హానికర మొక్కలపై ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ బి అనిల్ కుమార్, శాస్త్రవేత్త కే మమత తో కలిసి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనాజిపురం లోని రైతువేదిక లో రైతులకు పార్థినియం (వయారిభామ)యొక్క హానికారక ప్రభావాలను, నిర్మూలన మార్గాలపైన అవగాహన కల్పించి, పరిసరాలలోని వయ్యారిభామ మొక్కలను తొలగించారు. పంటపొలాల్లో, ఖాళీ స్థలాల్లో ఏ విధంగా నిర్మూలించుకోవాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.ఈ.ఓ.శ్రీశైలం , విద్యార్థులు పాల్గొన్నారు.